నిర్మాత దిల్ రాజ్ తన సినిమాల కథల విషయంలో మాత్రమే కాదు. ఆసినిమాల షూటింగ్ ప్లానింగ్ విషయంలో కూడ చాల పక్కాగా వ్యవహరిస్తాడు అన్నకామెంట్స్ ఉన్నాయి. అయితే ఈ అనుభవం అంతా రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ విషయంలో దిల్ రాజ్ కు ఏవిధంగాను సహకరించడం లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి.


ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందో దిల్ రాజ్ కు కూడ తెలియని పరిస్థితి ఏర్పడింది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించి సెప్టెంబర్ చివరి వారం నుండి ప్లాన్ చేసుకున్న కీలకమైన షెడ్యూల్ ఇప్పుడు వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.


వాస్తవానికి ఈసినిమాకు సంబంధించి హీరోయిన్ కియారా అద్వానీతో డేట్స్ తీసుకున్నాక కూడా ఈసమస్య రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీకి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ లో ఈమూవీలో నటించే నటీనటులు అంతా పాల్గొనవలసి ఉంది అని అంటున్నారు. అయితే ఈమూవీలో కీలకమైన నెగిటివ్ పాత్రలో నటిస్తున్న ఎస్ జె సూర్యతో ‘గేమ్ ఛేంజర్’ కు సమస్యలు ఏర్పడ్డాయి అంటున్నారు.


కార్తీక్ సుబ్బరాజ్ తీస్తున్న ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ మూవీలో సూర్య కీలక పాత్రలో నటిస్తున్న పరిస్థితులలో అతడి డేట్స్ విషయంలో సమస్యలు వస్తున్నాయి అంటున్నారు. లేటెస్ట్ గా విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోనీ’ ప్రమోషన్ కోసం తన డేట్స్ అన్నీ ఖాళీగా పెట్టుకున్న సూర్య అలసత్వం వల్ల ‘గేమ్ ఛేంజ్రర్’ కు సమస్యలు వచ్చాయి అని అంటున్నారు. ఇప్పుడు పరిస్థితులను పట్టి ఈమూవీ వచ్చే సంవత్సరం సమ్మర్ తరువాత మాత్రమే విడుదల అయ్యే ఆస్కారం ఉంది అన్న లీకులు వస్తున్నాయి. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత మరొక సినిమాలో రామ్ చరణ్ ను చూడాలి అని కోరుకుంటున్న అతడి అభిమానుల కోరిక ఇప్పట్లో తీరే ఆస్కారంలేదు..


మరింత సమాచారం తెలుసుకోండి: