హీరో రామ్ పోతినేని ,డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్ర స్కంద.. మోస్ట్ ఎవైడెడ్ చిత్రంగా పేరు పొందిన ఈ సినిమా నిన్నటి రోజున భారీ అంచనాల మధ్య విడుదల కావడం జరిగింది. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికీ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకొని దూసుకుపోతోంది.


ఈ సినిమాలోని పాటలు విషయంలో తమన్ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయారని పలువురు అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు. అయితే తాజాగా బ్యాగ్రౌండ్.. ట్విట్టర్ యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉండే రాగడి అనే ఒక యూట్యూబర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది.. తాను పంజాగుట్ట పివిఆర్ లో వ్యాక్సిన్ వార్ అనే సినిమా చూస్తూ ఉంటే మధ్యలో మ్యూజిక్ వినిపిస్తోంది
 ఎవరో ఫోన్ ఉపయోగిస్తున్నట్లుగా అనిపించింది..కానీ చాలా సేపు వెతికాను ఆ తర్వాత అర్థమయిందేమిటంటే పక్క స్క్రీన్ నుంచి సౌండ్ లీక్ అవుతోందని థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.


థమన్ అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల స్కంద థియేటర్ యాజమాన్యులు సౌండ్ స్థాయి చాలా ఎక్కువగా ఉందంటూ ఫిర్యాదు చేస్తున్నారని ఇది తమ పరికరాల పైన కూడా చాలా ప్రభావితం చేస్తుందని వాల్యూమ్ స్థాయిలను తగ్గించాలని ప్రేక్షకులు తెలియజేస్తున్నట్లుగా గుంటూరు ప్రాంతంలో GS సినిమాస్ థియేటర్లో ప్రేక్షకులు భావిస్తున్నట్లు అక్కడ యాజమాన్యం తెలియజేసింది. దీన్ని బట్టి చూస్తే స్కంద సినిమా మాస్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో పూరి చేస్తోందని చెప్పవచ్చు. అధికారికంగా డైరెక్టర్ చివరిలో ప్రకటించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: