బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కలయికలో రూపొందిన 'స్కంద'మూవీ గురువారం (సెప్టెంబర్ 28) ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ ఇంకా మలయాళ భాషల్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.అయితే ఆడియన్స్ నుంచి ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది. . ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత రామ్ మరోసారి ఊర మాస్ పాత్రలో నటించిన సినిమా ఇది. ఈ మూవీలో బోయపాటి రామ్ ని రెండు డిఫరెంట్ వేరియేషన్స్ తో కూడిన క్యారెక్టర్స్ లో చూపించారు.అయితే కథ రొటీన్ గానే ఉన్న సినిమాలో మాస్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, రామ్ ని మాస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసిన విధానం బాగా మెప్పించేలా ఉంది. ఇంకా అలాగే తమన్ BGMతో పాటు శ్రీ లీల గ్లామర్, డాన్స్ లపై కూడా మాస్ ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.


సినిమాలో మెయిన్ హైలెట్ అంటే హీరో రామ్ అనే చెప్పాలి. ఎందుకంటే రెండు డిఫరెంట్ వేరియేషన్స్ తో హీరో రామ్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసినట్లు తెలుస్తోంది. మాస్ ఆడియన్స్ కి అయితే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది.అయితే ఓవరాల్ గా ఈ సినిమా మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి అని చెప్పాలి.  ‘స్కంద’ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే..‘స్కంద’ చిత్రానికి మొత్తం రూ. 42.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.43 కోట్లు షేర్ ని వసూలు చేయాలి. మొదటి రోజు ఈ సినిమా మొత్తం రూ.10.27 కోట్లు షేర్ ను రాబట్టింది. హీరో రామ్ కెరీర్లో ఇవి హయ్యెస్ట్ & బెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. అయితే బ్రేక్ ఈవెన్ కి ఈ సినిమా ఇంకో రూ.32.73 కోట్ల షేర్ ను రాబట్టాలి.వీకెండ్


మరింత సమాచారం తెలుసుకోండి: