బబ్లు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అని ఇందులో హీరో రణబీర్ కపూర్ రష్మిక అద్భుతంగా నటించారని.. తెలియజేశారు. ఇవే కాకుండా ఆరు సినిమాలను నటిస్తున్నానంటూ తెలిపారు బబ్లు పృథ్వి. ఈ ఆరు సినిమాలలో తన పాత్రలు చాలా వెరైటీగా ఉంటాయని తెలియజేశారు. ఇక తమిళంలో కూడా నటిస్తున్నట్లు తెలిపారు. అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ సినిమాలు చూసి సినిమా అంటే ఇలా ఉండాలి అనుకున్నాను ఈ డైరెక్టర్ సినిమాలు ఒక్కసారైనా నటించాలనుకున్నాను కానీ అనుకోకుండా ఒకసారి డైరెక్టర్ సందీప్ రెడ్డి ఫోన్ చేసి యానిమల్ సినిమాలో అవకాశం ఉంది చేస్తారా అని అడగగానే షాక్ అయ్యి చేస్తాను సార్ అని చెప్పారట బబ్లు పృద్వి.
యానిమల్ సినిమా బ్యూటిఫుల్ సినిమా అని తెలిపారు VFX వర్క్ ల కారణంగా పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడుతూ ఉండడం మనం చూసాము కానీ డైరెక్టర్ సందీప్ రెడ్డి డబ్బింగ్ వర్షన్ల అవుట్ ఫుట్ పైనే పనిచేసే ఉపయోగించుకుంటారని నటుడు పృథ్వీరాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తెలియజేయడం జరిగింది. అయితే ఆయన ఈ సినిమాని చాలా అద్భుతంగా కూడా తెరకెక్కించారని తెలిపారు. మొత్తానికి ఎలా గైనా సరే రీఎంట్రీ ఇచ్చాను అంటూ తెలియజేశారు నటుడు బబ్లు పృధ్విరాజ్. ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి