సినిమా ఇండస్ట్రీ లోకి రావాలని ప్రతి ఒక్కరు కూడా కలలు కంటూ ఉంటారు. కొంతమంది కలలు కనడమే కాదు కార్యాచరణ కూడా చేసి ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీ లోకి వచ్చిన వారు కొంతమంది వరుస అవకాశాలు అందుకుంటూ సక్సెస్ అయితే.. ఇంకొంతమంది మాత్రం ఒక్కసారిగా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత కనుమరుగవ్వడం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుని ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన వారు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. అలాంటి వారిలో హీరో శివాజీ కూడా ఒకరు.


 మొన్నటి వరకు నటుడిగా రాజకీయ నేతగా మాత్రమే ప్రేక్షకులకు తెలిసినా శివాజీ.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి కంటస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రజలందరికీ కూడా మరింత దగ్గరవుతున్నారు అని చెప్పాలి. శివాజీకి ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉందా అనే విధంగా ఆటను కొనసాగిస్తూ ఇక ఎంతోమంది అభిమానుల ఓట్లను సంపాదించుకుంటున్నాడు. ఒకరకంగా చెప్పాలి అంటే మొదటి నుంచి శివాజీ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అని బయట ఉన్న ప్రేక్షకులందరికీ కూడా అనిపించేలా తన ఆటను కొనసాగిస్తున్నాడు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో బెక్కం వేణుగోపాల్ కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.


 అయితే ఈయన కేవలం శివాజీ వల్లే నిర్మాతగా అయ్యారని సమాచారం. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బెక్కం వేణుగోపాల్ శివాజీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం చేశారో అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. శివాజీ ఇండస్ట్రీలో హీరోగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో.. ఎడిటర్ గా కెరియర్ను మొదలుపెట్టారు అంటూ బెక్కం వేణుగోపాల్ చెప్పుకొచ్చారు. అలా సీసీ చానల్స్ ఎడిటర్ గా ఉన్న శివాజీని జెమినీ టీవీలో యాంకర్ గా చేసింది బెక్కం వేణుగోపాలే. ఇక తర్వాత యాంకర్ నుంచి హీరోగా మారిన తర్వాత శివాజీ ఏకంగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ని తన మేనేజర్ గా పెట్టుకున్నాడు. వీరిద్దరూ కలిసి లక్కీ మీడియా ఫ్యాక్టరీని స్థాపించి ఎన్నో సినిమాలను కూడా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: