తెలుగు ఇండస్ట్రీలో పంజాబీ నటిగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ Rx -100 సినిమాతో మంచి పాపులారిటీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాతో ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ అందుకున్నది. ఇందులో గ్లామర్ తో బోల్డ్ గా నటించి మరింత క్రేజ్ అందుకుంది. ఈ సినిమాకు మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించిన సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం కేవలం అడపాదడప సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని మాత్రం పరీక్షించుకుంటోంది.


అడపా దడపా సినిమాలలో నటించిన పాయల్.. తాజాగా మళ్లీ అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. పాయల్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో ఈమె పాత్ర నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమా పైన ఈ ముద్దుగుమ్మ ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాతో పాయల్ మళ్లీ పాయల్ కం బ్యాక్ ఇవ్వాలని చేస్తున్నట్లు తెలియజేసింది.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారుతున్నది. ఈ సినిమా ఆంధ్ర సీనియర్ మొత్తం కలుపుకొని దాదాపుగా 8 కోట్ల రూపాయలకు సింగిల్ పాయింట్తో అమ్మేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా టీజర్ చూసి కొనుక్కున్నారని చెప్పవచ్చు.. ఏకంగా ఆంధ్రాలో 6 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినట్లు సమాచారం.. ఈ డేట్ విషయంలో మరో రెండు కోట్లు అనుకుంటే విడుదలకు ముందే బయ్యర్లకు దాదాపుగా 80 లక్షల రూపాయల లాభాన్ని అందుకున్నట్లు చెప్పవచ్చు . ప్రస్తుతం అటు డైరెక్టర్ ఇటు పాయల్ కెరియర్లో మంగళవారం సినిమా ఒక టర్నింగ్ పాయింట్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: