మాస్ హీరో రవితేజ దసరా కానుకగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పక్క మాస్ ఎంటర్టైర్మెంట్ చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ను రాబట్టుకుంది. ఇక ఇప్పుడు రవితేజ తన తదుపరి సినిమాల పైన బాగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో RT4GM చిత్రాన్ని కి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే పూర్తి అయ్యి సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టారు. రవితేజ నటించిన మరొక చిత్రం ఈగల్ ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

సినిమా ప్రమోషన్స్ ను కూడా చిత్ర బృందం మొదలుపెట్టడానికి సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే ఈ చిత్రం నుంచి టీజర్ ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు చిత్రబృందం. గతంలో ఈ సినిమా అనౌన్స్మెంట్ చేస్తూ ఒక రిలీజ్ చేసిన వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సస్పెన్స్ చిత్రాలుగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈగల్ సినిమా టీజర్ ని విడుదల చేయబోతున్నామని తెలిసి ఎలాంటి హైప్ ని క్రియేట్ చేస్తారో అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగా మొదటిసారి ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు.


కార్తికేయ-2 చిత్రంతో పాటు రవితేజ సినిమా ధమాకా డిస్కో రాజా చిత్రాలకు కూడా కార్తీక్ డిఓపిగా పనిచేయడం జరిగిందట. ఈ సినిమాలో రవితేజ కి జంటగా అనుపమ పరమేశ్వరన్, కావ్య దాపర హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. అలాగే నవదీప్ వినయ్ రామ్ కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజున ఉదయం 10:44 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ని సైతం విడుదల చేయబోతున్నట్లు తెలియజేసింది చిత్ర బృందం. మరి ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: