తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్ పనులు ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విరు ఏ సినిమాలో నటిస్తున్నారు ..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ఏ ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి , శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ ను షూట్ చేస్తున్నారు. దీనిని ఒక ప్రత్యేక సెట్ లో ప్రస్తుతం ఈ మూవీ బృందం చిత్రీకరిస్తుంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ పై ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ చిత్ర బృందం వారు రామోజీ ఫిలిం సిటీ లో అల్లు అర్జున్ మరియు కొంత మంది ఇతరులపై ఈ మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం చిత్రీకరణ దశల్లో ఉన్న ఈ మూడు మూవీ లపై కూడా అదిరిపోయే రేంజ్ లో అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: