టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. కార్తికేయ 2 మూవీ తో వచ్చిన క్రేజ్ తో నిఖిల్ నటించిన లేటెస్ట్ 'స్పై'..భారీ అంచనాలతో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ ఏడాది జూన్‍లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.స్పై యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. స్పై సినిమాలో ఐశ్వర్య మీనన్, అభినవ్ గోమటం, జిస్సు సెంగుప్త, నితిన్ మెహతా, ఆర్యన్ రాజేశ్, సాన్య ఠాకూర్, మక్రంద్ దేశ్ పాండే మరియు రవివర్మ కీలకపాత్రలు పోషించారు. హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాలో క్యామియో రోల్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ మరియు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఈడీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.. ఇదిలా ఉంటే స్పై సినిమా ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్‌కు రెడీ అయింది.
స్పై సినిమా ఈటీవీ తెలుగు ఛానెల్‍లో ప్రసారం కానుంది. డిసెంబర్ 3 వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు స్పై మూవీ ఈటీవీలో ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని ఈటీవీ తాజాగా వెల్లడించింది.నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించిన మిస్టరీని చూపించబోతున్నామంటూ మూవీ యూనిట్ బాగా ప్రచారం చేయడంతో స్పై సినిమాపై భారీ గా అంచనాలు నెలకొన్నాయి. అయితే. సుభాష్ చంద్రబోస్ మిస్టరీ గురించి చిత్రంలో చాలా తక్కువ గా చూపించారు.అందులోనూ ఈ సినిమా కథ, కథనాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవటంతో మొదటి నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో థియేటర్లలో ఈ చిత్రం పరాజయం పాలైంది.స్పై సినిమా తీవ్రంగా నిరుత్సాహపరటంతో అభిమానులకు క్షమాపణ చెబుతూ ఓ లెటర్ కూడా నిఖిల్ అప్పట్లో పోస్ట్ చేశారు. ఈ సినిమా పరాజయం బాధ్యతను తాను తీసుకుంటున్నానని, భవిష్యత్తులో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యమైన సినిమాలను చేస్తానని ఆయన పేర్కొన్నారు.స్పై మూవీ ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూలై నుంచి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: