మీడియం రేంజ్ హీరోలలో ప్రస్తుతం నాని నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. తన సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా వరసపెట్టి సినిమాలు చేస్తున్న నాని స్పీడ్ చూసి చాలామంది టాప్ హీరోలు షాక్ అవుతున్నట్లు సమాచారం. డిసెంబర్ 7న ‘హాయ్ నాన్న’ విడుదలకాబోతొంది.  కూతురు సెంటిమెంట్ తో రాబోతున్న రూపొందిన ఈ మూవీ పై అంచనాలు బాగా ఉన్నాయి. ఈసినిమా ఇంకా విడుదల కాకుండానే మీద వివేక్ ఆత్రేయతో ‘సరిపోలేదా శనివారం’ మూవీని చేస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి మూవీ ప్రాజెక్ట్ మొదలు కాబోతోంది.ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి లేదా మార్చ్ లో ఈమూవీ మొదలుపెట్టే ఆస్కారం ఉంది అంటున్నారు. ఈమూవీని వేగంగా పూర్తి చేసి నాని దర్శకుడు శైలేష్ కొలను తో ‘హిట్ 3 ది థర్డ్ కేస్’ ప్రాజెక్ట్ చేయాలని నాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సీక్వెల్ కు సంబంధించిన హింట్ ను అడవి శేష్ ‘హిట్ 2’ క్లైమాక్స్ లో ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు ఈసినిమాను చేస్తూనే తనకు ‘దసరా’ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల తో మరో సినిమాకు నాని రెడీ అవుతున్నట్లు టాక్.ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా 5 సినిమాలకు లైన్ క్లియర్ చేసిన నాని వచ్చే సంవత్సరం అంతా తెగ బిజీగా ఉండబోతున్నాడు. అయితే వచ్చేనెల మొదటి వారంలో విడుదల కాబోతున్న ‘హాయ్ నాన్న’ మూవీ ఫిలితం బట్టి నాని భవిష్యత్ లో చేయబోయే సినిమా కథల ఎంపికలో మార్పులు ఉండవచ్చు అన్న సంకేతాలు వస్తున్నాయి. ఒకవైపు క్లాస్ ప్రేక్షకులను తానా వాయిపు తిప్పుకుంటూనే మరొక వైపు మాస్ సినిమాలాను చేయాలి అన్న నాని ఆలోచనాలు ఎంతవారకు సక్సస్ అవుతాయో చూడాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి: