దక్షిణాది చిత్రాలలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి..R. సుబ్బలక్ష్మి అలనాటి ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. ప్రస్తుతం ఈమె వయసు 87 సంవత్సరాలు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ కొచ్చిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నిన్నటి రోజున రాత్రి ఇమే తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. దీంతో దక్షిణాది సిని పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈమె మరణించిన విషయాన్ని ఆమె మనవరాలు సౌభాగ్య సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది.దీంతో పలువురు సెలబ్రిటీలు అభిమానుల సైతం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేస్తున్నారు.


ఈమె మనవరాలు ఇలా పోస్ట్ చేస్తే నా బలం మా అమ్మమ్మను నేను కోల్పోయాను అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని సైతం షేర్ చేయడం జరిగింది. ఈమెకు ఇద్దరు అమ్మాయిలు ఒక కుమారుడు ఉన్నారు.. సుబ్బలక్ష్మి తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం హిందీ కన్నడ వంటి ఎన్నో భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సంస్కృతంలో కూడా ఒక సినిమాలో నటించినట్లు తెలుస్తోంది.తెలుగులో తొట్టెంపూడి వేణు నటించిన కళ్యాణ రాముడు సినిమాలో బామ్మ పాత్రలో అలరించింది.

నాగచైతన్య నటించిన ఏం మాయ చేసావే సినిమాలో కూడా సమంతకు అమ్మమ్మగా నటించడం జరిగిందట. చివరిగా సుబ్బలక్ష్మి నటించిన చిత్రం బీస్ట్. మొత్తం మీద తన కెరియర్లో 70కి పైగా సినిమాలలో నటించి మరింత క్రేజ్ అందుకుంది సినిమాలలోనే కాకుండా బుల్లితెర పైన కూడా ఎన్నో సీరియల్స్ లో నటించి ఆకట్టుకుంది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి ఇండస్ట్రీలోకి రాకముందు జవహర్ బాల భవన్ లో సంగీత నాట్య శిక్షకురాలుగా పనిచేయడం జరిగిందట. అలాగే 1951లో ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం కూడా చేయడం జరిగిందట సౌత్ ఇండస్ట్రీ నుంచి ఆల్ ఇండియా రేడియోలో పనిచేసిన మొట్టమొదటి లేడీ కంపోజర్ గా సుబ్బలక్ష్మి పలు రికార్డును సైతం సృష్టించినది. డంపింగ్ ఆర్టిస్టుగా కూడా పేరు సంపాదించిన సుబ్బలక్ష్మి అకాల మరణంతో పలువురు అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: