
అయితే షీలా , చోలాన్ ఇద్దరూ కూడా ప్రేమించుకుని వివాహం చేసుకోవడం జరిగింది. తమిళ ఇండస్ట్రీలో ఫిలిం ఇన్స్టిట్యూట్ నడుపుతున్న చోళన్ పలు రకాల షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న సందర్భంలో ఈమెతో ప్రేమలో పడడం జరిగిందట. వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించకపోవడంతో పెద్దలను ఎదిరించి మరి వివాహాన్ని చేసుకున్నారు. వీరి పెళ్లి సముద్రం మధ్యలో జరగడంతో వార్తలు నిలిచారు. క్లాసికల్ డాన్సర్ గా పేరు పొందిన షీలా రాజ్ కుమార్ 2016లో అరదుచినమ్ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది . 2017లో జీ తమిళ్ లో వచ్చిన ఆశయ తమిళ దాత్య అనే ఒక సూపర్ హిట్ సీరియల్స్ లో కూడా ఈమె ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. ఈ సీరియల్ ఈమె కెరీర్ ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఇక తర్వాత ద్రౌపది అనే సినిమాలో కూడా నటించింది.. ఇటీవలే కార్తీక సుబ్బరాజు తెరకెక్కించిన జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో సూర్యకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా కూడా నటించడం జరిగింది.. అలాగే విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు-2 చిత్రంలో ఆయనకు చెల్లెలుగా కూడా నటించింది తన నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటించిన శీల ఇలా విడాకుల వ్యవహారంలో మరొకసారి వైరల్ గా మారుతోంది.