ప్రముఖ టాలీవుడ్ నటుడు, విలన్ కరోనా సమయం లో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువేననే సంగతి తెలిసిందే. సోనూసూద్ ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.కోట్ల రూపాయల సహాయం చేసి మంచి పేరును సంపాదించుకున్నారు. సోనూసూద్ రాజకీయాల్లో కి వస్తే సక్సెస్ సాధించడం తో పాటు మరిన్ని సంచలన విజయాలను ఖాతా లో వేసుకునే ఛాన్స్ అయితే ఉంది.మంచితనమే సోనూసూద్ పాలిట శాపమైందని కరోనా తర్వాత తెలుగు సినిమాలలో సోనూసూద్ కు ఆఫర్లు తగ్గాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. సోనూసూద్ కు ఇతర భాష ల్లో సైతం గతంలోలా మూవీ ఆఫర్లు అయితే రావడం లేదు. అయితే తాజా గా సోనూసూద్ తండ్రి ఆపరేషన్ కోసం బాధపడుతున్న యువకుడికి భరోసా ఇచ్చారు. మీ నాన్నకు గుండె ఆపరేషన్ చేయించి కాపాడతానని సోనూసూద్ చెప్పుకొచ్చారు. యూపీ లోని డియోరియా కు చెందిన పల్లవ్ సింగ్ అనే వ్యక్తి తన తండ్రి గుండె కేవలం 20 శాతం మాత్రమే పని చేస్తోందని తండ్రి బ్రతకాలంటే ఆపరేషన్ అవసరమని పూర్తి వివరాలతో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసి సోనూసూద్ స్పందించారు. "మేము మీ తండ్రి ని చనిపోనివ్వము సోదరా.. నా పర్సనల్ సోషల్ మీడియా ఐడీ ఇన్ బాక్స్ కు డైరెక్ట్ గా మీ నంబర్ పోస్ట్ చేయండి.. దయచేసి పోస్ట్లో పోస్ట్ చేయవద్దు" అని సోనూసూద్ కామెంట్ చేశారు.సోనూసూద్ పోస్ట్ కు 9,200కు పైగా లైక్స్ వచ్చాయి. సోనూసూద్ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు మరింత దగ్గరవ్వాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల లో సోనూసూద్ భాగమైతే బాగుంటుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. సోనూసూద్ నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్ల నుంచి సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: