
ఇక ఈసినియాల రాజశేఖర్ అతిథి పాత్ర సినిమాకు ప్లాస్ అవుతుంది అంటున్నారు ఆడియన్స్.. ఈ సినిమా కథలో కొత్తదనం లేకపోయినా.. రోటీన్ స్టోరీ అయినా.. కామెడీ టైమింగ్ తో.. సినిమాను నిలబెట్టారు. మరీముఖ్యంగా రావు రమేష్ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచారు. సినిమాను నిలబెట్టారంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. సినిమా ఆసాంతం నాన్ స్టాప్ నవ్వులు పంచుతుంది అంటున్నారు.అంతే కాదు ఈసినిమాకు సెకండ్ హాఫలో వచ్చే పాటలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయంటున్నారు. ఇక ఈ సినిమాలో నితిన్ పెర్ఫామెన్స్ పై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. ఎస్ ఐ సాయి నాథ్ పాత్రలో నితిన్ అద్భుతంగా నటించాడని. చాలా మంచి ఫన్ ను క్రియేట్ చేశారన్నారు. సెకండ్ హాప్ సినిమా అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.ఇక ఈసినిమాపై నెగెటీవ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈసినిమాకు కామెడీ ప్లాస్ అని కొందరు అంటుంటే..అదే కామెడీ సినిమాకు మైనస్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. హాస్యం ఓవర్ డోస్ అయ్యిందని. ఒక కమర్షియల్ సినిమాకు ఇది హెల్దీ కాదు అంటూ..పోస్ట్ చేశారు. అసలు ఒక రకంగా కమర్షియల్ సినిమా ఎలా తీయ్యకూడదో చెప్పడానికి ఈసినిమ ఉదాహరణ అంటూ నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాపై నెగెటీవ్ కామెంట్ చేశాడో నెటిజన్.ఇక ఈసినిమా అట్టర్ ప్లాప్ అంటూ మరికొందరు కామెంట్లుపెడుతున్నారు. కామెడీ ఓవర్ డోస్ అయిందని, ఇరిటేటింగ్‌లా ఉందని అంటున్నారు. అంతే కాదు.. ఈసినిమా అవుట్ డేటెడ్, డిజాస్టర్ అని సోషల్ మీడియా లో కామెంట్లుపెడుతున్నారు. మరి రెండు రకాలుగా కామెంట్లుసాధించిన ఈసినిమా..ఆడియన్స్ నవ్వించగలదా.. ప్లాప్ లతో సావాసం చేస్తున్న హీరో నితిన్, డైరెక్టర్ వక్కంతం వంశీ.. ఇప్పుడైనా బయట పడతారా అనేది చూడాలి.