మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఈగల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను కూడా ఇప్పటికే మొదలు పెట్టారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి ఒక చిన్న వీడియోను విడుదల చేశారు.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ నుండి ఇప్పటివరకు ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రముఖ సినిమాటో గ్రాఫర్ అయినటువంటి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తూ ఉండగా .... అనుపమ పరమేశ్వరన్ ,  కావ్య తప్పర్ ఈ సినిమాలో రవితేజ కు జోడిగా కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ మూవీ సెట్స్ పై ఉండగానే రవితేజ తాజాగా మరొక మూవీ ని కూడా ఓకే చేసుకున్నాడు. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు నిర్మించనున్నారు.

ఇకపోతే ఈ మూవీ ని హిందీ సినిమా అయినటువంటి "రైడ్" ఆధారంగా తెరకెక్కించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన ఒక కీలక షెడ్యూల్ ను ఉత్తరప్రదేశ్ లో ఈ మూవీ బృందం చిత్రీకరించేందుకు ప్లాన్ చేసినట్లు ... ఉత్తరప్రదేశ్ లో ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: