తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో ఇప్పటికీ బిసి సెంటర్లలో 5 నుండి 10 ధియేటర్ల సంఖ్య మించి ఉండవు. దీనితో ఒకేసారి 4-5 భారీ సినిమాలు విడుదల అయితే ఆసినిమాల మధ్య పోటీ పెరిగి పోవడంతో ఈ భారీ సినిమాలను కొనుక్కున్న బయ్యర్లు తమ సినిమాలకు సరైన ధియేటర్లు దొరకక తెగ ఇబ్బంది పడిపోవడం సాధారణమైన విషయంగా మారింది.



మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ కు ఒకేసారి 4-5 భారీ సినిమాలు విడుదల అయినప్పుడు ధియేటర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగి బయ్యర్ల నుండి అడ్వాన్స్ లు కూడ ధియేటర్ల యజమానులు విపరీతంగా వసూలు చేస్తున్న సందర్భాలు గతంలో అనేకసార్లు ఎదురైన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం దాసరి నారాయణరావు జీవించి ఉన్న రోజులలో సంక్రాంతి సీజన్ లో ధియేటర్ల యజమానుల మధ్య విపరీతమైన పోటీ ఉన్నప్పుడు వారిని దాసరి నచ్చచెప్పి వారిని సంక్రాంతి రేస్ నుండి తప్పించిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి.



దాసరి మరణించిన తరువాతా ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద ఒక లేకపోవడంతో హీరోలను కొనుక్కున్న బయ్యర్లకు తమ సినిమాకు సంబంధించి దర్శక నిర్మాతలు  విపరీతంగా ప్రమోట్ చేసుకోవలసి వస్తోంది. దీనితో చిన్న సినిమా నిర్మాతలు అత్యంత ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.



సంక్రాంతి పండుగకు చాల ముందుగా వస్తున్న ‘గుంటూరు కారం’ ముందుగా వస్తోంది కాబట్టి బిసి సెంటర్లలో ఎక్కువ ధియేటర్లు ఆక్రమించడంతో మహేష్ మూవీ తరువాత సంక్రాంతి వార్ కు రెడీ అవుతున్న వెంకటేష్ ‘సైంధవ్’ తేజ్ సజ్జా ‘హనుమాన్’ రవితేజ ‘ఈగల్’ మూవీలు కూడ ఒకదాని పై ఒకటి పోటీ పడటంతో బిసి సెంటర్లలో సరైన ధియేటర్లు లేక ఈసినిమాల బయ్యర్లు తెగ టెన్షన్ పడుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. దీనితో ఎప్పుడు లేనివిధంగా సంక్రాంతి సినిమాలకు బిసి సెంటర్లలో ఏర్పడిన ధియేటర్ల కొరత టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: