అయితే ఇలా ఇండస్ట్రీలో కనుమరుగైన హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలు కొన్నెళ్ల తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చాయి అంటే చాలు ఇక ఆ హీరోయిన్ లలో వచ్చిన మార్పులు చూసి అభిమానులు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఒక హీరోయిన్ ను చూసి ఇలాగే షాక్ లో మునిగిపోతున్నారూ చాలామంది సినీ ప్రేక్షకులు. ఆమె కుటుంబంలో తండ్రి మినహా అందరూ కూడా నటులే. ఇక ఆమె కూడా హీరోయిన్గా చేసింది. రెండు సినిమాల్లో చేసిన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కానీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె ఎవరో కాదు తులసి నాయర్. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా సాగిన రాధా చిన్న కూతురు తులసి. మణిరత్నం మూవీ అయినా కాదల్ సినిమాతో హీరోయిన్ గా మారింది. తెలుగులో కడలి పేరుతో ఈ సినిమా రిలీజ్ అయింది తర్వాత జాన్ అనే మరో తమిళ సినిమాలో నటించింది. తెలుగులో ఇది రంగం 2 గా విడుదలైంది. అయితే సినిమాల్లో మాత్రం పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది తులసి. ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో.. ఆమెను చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి