వీర సింహారెడ్డి చిత్రం ద్వారా తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి హనీ రోజు.. ఈ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు అంతకుముందు తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. కాని బాలయ్యతో నటించిన వీరసింహారెడ్డి సినిమాతో ఈమె క్రేజ్ మారిపోయింది. ముఖ్యంగా ఈ అమ్మడు హాట్ ఫోటోషూట్లకు కుర్రకారులు ఫిదా అయిపోయారు. మతిపోయే షేపులతో అందచందాలతో కుర్రకారులను ఎప్పుడు సోషల్ మీడియాలో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.


దీంతో ఈ అమ్మడు అప్పటినుంచి ఇమే క్రేజ్ పెరుగుతూనే ఉంది.. ప్రస్తుతం హనీ రోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రాహేలు. ఆనందిని బాల చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని ఈ సినిమా గురించి పలు విషయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో యువతని మెప్పించే అంశాలు చాలా పుష్కలంగా ఉంటాయని టాక్ వినిపిస్తున్నది. స్క్రిప్ట్ దశలోనే ఆ రకమైన జాగ్రత్తలు చిత్ర బృందం తీసుకున్నట్లు సమాచారం.


ముఖ్యంగా నటి హనీ రోజు తో ఇందులో కొన్ని ఘాటైన మసాలా సన్నివేశాలను కూడా చిత్రీకరించారని అవే ఈ చిత్రానికి ప్రత్యేకంగా అట్రాక్షన్ గా నిలుస్తాయని కుర్రకారులలో ఊపు తెప్పించేలా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. హనీ రోజ్ పాత్ర రాహేలు చిత్రంలో ఎవరు ఊహించని విధంగా ఉంటుందని ఎన్నో సన్నివేశాలు సర్ప్రైజింగ్ అనిపిస్తాయని చిత్ర బృందం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ముద్దుగుమ్మ ఎంతటి సాహసాలు చేయించారో అనే విషయం తెలియాలి అంటే విడుదల వరకు ఆగాల్సిందే. చాలా మంది హీరోయిన్స్ సైతం ఈ మధ్యకాలంలో ఐటెం భామలుగా మారుతున్నారు. సినిమాకి అవసరమైతే ఎలాంటి సన్నివేశాలలోనైనా కనిపించడానికి సిద్ధంగానే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: