ఒకప్పుడు స్పై సినిమాలంటే ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే వారు.స్క్రీన్ ప్లే అదిరిపోయింది అంటే కచ్చితంగా బొమ్మ బ్లాక్ బాస్టర్ అని చెప్పేవారు.. కానీ ఈ మధ్య సినిమా మొత్తం మారిపోయింది స్క్రీన్ ప్లే అదిరిపోయేలా ఉన్న స్టోరీ కూడా బాగుండాలి దీంతో స్పై సినిమా అంటే అంత ఈజీగా ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు.. ఈ మధ్య వరుసగా స్పై సినిమాలు కూడా డిజాస్టర్లుగా మిగులుతున్నాయి. ఈ బ్యాడ్ సెంటిమెంటును సైతం కళ్యాణ్ రామ్ బ్రేక్ చేశారా లేదా అనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం.

కళ్యాణ్ రామ్ ఇటీవలే డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. ఈ డెవిల్ సినిమాకి ఏమాత్రం స్క్రీన్ ప్లే మిస్ అయిన చాలా దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా దీని రిజల్ట్ కూడా కెరియర్ పైన చాలా భారీగా పడుతుంది. గతంలో మహేష్ బాబు తెరకెక్కించిన స్పైడర్ సినిమాని తీసుకుంటే ఈ సినిమా దెబ్బకు స్పైడర్ మాన్ సినిమా అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ వద్దనుకునేలా చేశారు.. అలాగే అఖిల్ ఏజెంట్ నటించిన చిత్రానికి కూడా భారీ షాక్ తగిలింది ఈ సినిమా అతని కెరీర్ లోని భారీ ఫ్లాప్ గా మిగిలింది.

నిఖిల్ కూడా నటించినా స్పై సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. గూడచారి వంటి కథలు చాలా పగడ్బందీగా చెబితే వర్కౌట్ కావు కానీ.. అడవి శేషు నటించిన గూడచారి, నవీన్ పోలిశెట్టి చేసిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఇటీవల కళ్యాణ్ రామ్ విడుదల చేసిన డెవిల్ సినిమా విషయానికి వస్తే 1943లో జరిగే ఒక బ్రిటిష్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ అభిషేక్ నాయ దర్శకత్వం వహించగా.. ఈ సినిమా మొదటిరోజు మిక్స్డ్. టాక్ తెచ్చుకుంది. మరి డెవిల్ సినిమా స్పై లాంటి బ్యాడ్ సెంటిమెంట్లను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి మరి. ఈ సినిమా మొదటి రోజు 4 కోట్లకు పైగా క్రాస్ కలెక్షన్స్ రాబడినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: