విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 10 సౌత్ ఇండియన్ ట్రైలర్స్ ఏవో తెలుసుకుందాం.

మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 37.68 మిలియన్ వ్యూస్ దక్కాయి.

ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో 32.58 మిలియన్ వ్యూస్ దక్కాయి.

తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 31.91 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 29.08 మిలియన్ వ్యూస్ దక్కాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 26.77 మిలియన్ వ్యూస్ దక్కాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు.

అజిత్ హీరోగా రూపొందిన తునీవు మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 24.96 మిలియన్ వ్యూస్ దక్కాయి.

ప్రభాస్ హీరోగా రూపొందిన రాధే శ్యామ్ మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో 23.20 మిలియన్ వ్యూస్ దక్కాయి.

విజయ్ హీరోగా రూపొందిన వారసు మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో 23.05 మిలియన్ వ్యూస్ దక్కాయి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య మూవీ ట్రైలర్ కు విడుదల 24 గంటల్లో 21.86 మిలియన్ న్యూస్ దక్కాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో 21.81 మిలియన్ వ్యూస్ దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: