తెలుగు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ మీనా గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎంతో మంది హీరోలతో నటించి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. ఈమధ్య పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మీనా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే మీనా రాజకీయాలలోకి రాబోతోందని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. వాటికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.


సాధారణంగా సినీ ఇండస్ట్రీకి రాజకీయానికి మంచి అనుబంధం ఉంది.చాలా మంది సెలబ్రిటీలు సైతం రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అవుతున్నారు. మరికొంత మంది సొంతంగానే పార్టీ పెట్టి మంచి పాపులారిటీ అందుకుంటున్నారు. తాజాగా మీనా త్వరలోనే బిజెపి పార్టీలోకి చేరే అవకాశం ఉందన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో కేంద్రమంత్రి..L. మురుగన్ నిర్వహించిన పొంగల్ వేడుకలకు ఈమె వెళ్లడం జరిగింది. అక్కడ ఆమె రాజకీయ ప్రవేశం చేయబోతుందని వార్తలకు మరింత బలం చేకూర్చే విధంగా చేసినట్టు కనిపిస్తోంది.


ఈ వేడుకలకు ప్రధాన మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు బిజెపి నేతలు కూడా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో మీనా కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారుతున్నది. బిజెపి నేతలతో కనిపించడంతో మీనా కచ్చితంగా బిజెపి పార్టీలో చేరబోతోందని అందుకే మీనాకు అధిక ప్రాధాన్యతమిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మీనా కూడా పొలిటికల్ వైపుగా అడుగులు వేసేందుకే ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు ప్రచారంలో వినిపిస్తోంది.. మరి ఈ విషయం పైన మీనా ఇప్పటి వరకు స్పందించలేదు.. మరి దీనిపైన మీనా స్పందిస్తే బాగుంటుందని పలువురు అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. తన భర్త మరణం నుంచి నెమ్మదిగా కోలుకుంటూ మీనా ఇప్పుడిప్పుడే బయట పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: