టాలీవుడ్ లో యంగ్ హీరోగా పేరుపొందిన నాగచైతన్య , సమంత జంట గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. వీరిద్దరూ కలిసి ఏంమాయ చేసావే సినిమాలో నటించగా అప్పటినుంచి ప్రేమించుకుంటూనే ఉన్నారు. కొంతకాలం తర్వాత ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి మరి వివాహం చేసుకున్న ఈ జంట కొన్ని మనస్పర్ధలు వల్ల విడాకులు తీసుకోవడం జరిగింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఎప్పటికైనా నాగచైతన్య, సమంత కలుస్తారని అందరూ అనుకున్నారు.. కానీ ఇప్పుడు ఆ ఆశలు అడియాశలు అయినట్టుగా కనిపిస్తోంది.


విడాకుల అనంతరం నాగచైతన్య ఒంటరిగా ఉంటూ కేవలం తన కెరీర్ మీద ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. సమంత కూడా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఇండస్ట్రీకి దూరమై కాస్త రెస్ట్ తీసుకుంటోంది.కానీ గత కొంతకాలంగా వీరిద్దరికి సంబంధించి ఒక న్యూస్ మాత్రం వైరల్ గా అవుతోంది. ముందుగా నాగచైతన్య రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే న్యూస్ వైరల్ గా మారుతోంది .నాగార్జున బంధువుల అమ్మాయితో చైతు పెళ్లి చేయాలని నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివరకు లేదా వచ్చే ఏడాది ఫస్ట్ లో వీరి పెళ్లి చేయాలని పట్టుదలతో నాగ్ ఉన్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.


అంతేకాకుండా గతంలో అఖిల్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత వివాహం ఆగిపోవడంతో ఇటు నాగచైతన్య కూడా విడాకులు తీసుకోవడంతో తమ కొడుకుల జీవితం ఇలా అయింది ఏంటి అంటూ నాగార్జున ఆలోచించి ఇలా చైతన్య , అఖిల్ ఎవరో ఒకరు ఒప్పుకుంటే కచ్చితంగా పెళ్లి చేస్తే కుటుంబం కాస్త ఆనందంగా ఉంటుందని భావించి నాగార్జున ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: