2022 లో థియేటర్లో విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం మసూద్.. ఆ ఏడాది బెస్ట్ హర్రర్ సినిమాగా కూడా పేరు సంపాదించింది.. ఇందులో యంగ్ హీరో తీరువీర్.. అలాగే హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు.. కీలకమైన పాత్రలో అలనాటి హీరోయిన్ సంగీత నటించిన ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ హర్రర్ మూవీ భారీ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇదంతా ఇలా ఉండగా ప్రేక్షకులు ఎంతగానో ఈ సినిమా సీక్వెల్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.


అయితే ఇటీవల తాజాగా ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ తాజాగా  మసూద ఫ్రీక్వెల్ తీసుకురాబోతున్నట్లు తెలియజేశారు.. భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్లో సైతం ఈ విషయాన్ని తెలియజేశారు.. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఫ్రెష్ సినిమాలు వస్తాయని అందుకే తాను కొత్త వాళ్ళని తీసుకుంటూ ఉంటానని తెలిపారు. కొత్త టాలెంట్ వస్తోంది కాబట్టే అదే తన బిగ్గెస్ట్ సపోర్ట్ అని తెలియజేశారు. కొత్త డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు రైటర్లు వచ్చినప్పుడు ఎన్నో విషయాలు కూడా బయటికి వస్తాయని రిస్క్ ఎక్కువగా తీసుకుంటున్నప్పటికీ ఇలానే తీయాలి అలానే తీయాలని కండిషన్స్ ఏమీ ఉండవని తెలిపారు.


ఇలాంటి కొత్త కంటెంట్ సినిమాలను చూసినప్పుడే తనకు నిజంగా ఆనందం కలుగుతుందని తెలిపారు. ఈ సినిమా డైరెక్టర్ మైథాలజీనే ఫిక్షనల్ వంటి వాటిలో కూడా కొత్తగా డైరెక్టర్ కథను రాశారని.. ఏజెంట్ ఆత్రేయ-2 సినిమా తీస్తే ఎవరితో తీయాలి అనే ప్రశ్నకు రాహుల్ ఇలా సమాధానం ఇస్తే ఆ సినిమా కథను బట్టి నిర్ణయం తీసుకుంటామంటూ తెలిపారు. స్వరూప్ కూడా దానిమీద వర్క్ చేస్తున్నారని ఆరు నెలల నుంచి స్క్రిప్ట్ సాగుతూనే ఉందంటూ తెలిపారు.. మసూద ఫ్రీక్వెల్ ని కూడా ప్లాన్ చేస్తున్నామని అది ఎప్పుడు అవుతుందో చెప్పలేమంటూ క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: