బాలీవుడ్లో స్టార్ కపుల్స్ గా పేరుపొందిన దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.. అయితే అభిమానులు సైతం ఎన్నో ఏళ్లు గా గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు.. ఆ గుడ్ న్యూస్ ఈ రోజున తెలియజేసింది దీపికా పదుకొనే ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇంస్టాగ్రామ్ లో అధికారికంగా ఈ ముద్దుగుమ్మ ప్రకటించింది. దీపిక రణవీర్ సింగ్ వివాహం 2018లో జరిగింది.. కొన్ని రోజులుగా దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీ విషయం గురించి సోషల్ మీడియాలో కూడా పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.


ముఖ్యంగా ఈమె బేబీ బంప్ కవర్ చేసిందంటూ కూడా బాలీవుడ్ మీడియాలో వార్తలైతే వినిపించాయి.. చీరలో కాస్ట్యూమ్స్ జ్యూయలరీలో దీపిక మరింత కనిపించింది. తాజాగా తన ప్రెగ్నెన్సీ గురించి అధికారికంగా ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ.. దీంతో తమ కుటుంబ సభ్యులలోని ఆనందానికి అవధులు లేవంటూ కూడా తెలియజేసినట్టు తెలుస్తోంది.. దీపిక పదుకొనే సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ తో కలిసి.. కల్కి 2898AD అనే చిత్రంలో నటిస్తోంది ఈ చిత్రానికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.


కీలకమైన పాత్రలో అమితాబచ్చన్ ,కమలహాసన్, దిశాపటాని వంటి వారు నటిస్తున్నారు. ఈ ఏడాది మే 9వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.. గత కొన్నేళ్లుగా  ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. గత ఏడాది పఠాన్ జవాన్ సినిమాలతో మంచి విజయాలను అందుకుంది దీపికా పదుకొనే.. ఇటీవల హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ సినిమాలో కూడా తన అందాలతో మరొకసారి బ్లాస్టింగ్ చేసింది. అయితే బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తల్లి కాబోతున్నానని విషయాన్ని తెలియజేసి అభిమానులను ఆనందపరిచింది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 2024 అనే తేదీని హైలెట్ చేస్తూ తన డెలివరీ డేట్ ని కూడా తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: