తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం హనుమాన్.. ఈ సినిమా ఓటీటి కోసం ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ సినిమా ఒకసారి కొత్త రికార్డులను సైతం క్రియేట్ చేసింది.. తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాగా మిగతా ఇండస్ట్రీలో కూడా గట్టిగానే ఇంపాక్ట్ చూపించిందని చెప్పవచ్చు. సినిమా కంటెంట్ పైన పలు రకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ కలెక్షన్స్ మాత్రమే ఎక్కడ తగ్గలేదు. దాదాపుగా 100 కోట్లకు పైగా లాభాలను అందించింది..


అలాగే హనుమాన్ చిత్రంలో పెద్దగా స్టార్ కాస్ట్ కూడా లేదని ఒకప్పటి చైల్డ్ యాక్టర్ గా పేరు సంపాదించిన తేజ సజ్జ హీరోగా నటించారు. యువ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం ఈ సినిమాకి ఫాంటసీ కథను మాత్రమే జోడించారు.. ఈ సినిమా విడుదలై మొదటిరోజే వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.. దాదాపుగా 50 రోజుల వేడుక కూడా చాలా ఘనంగా జరుపుకున్నారు.. రీసెంట్గా ఏ చిత్రానికి సంబంధించి వేడుక కూడా జరుపుకోవాలని ఈ సినిమా సీక్వెల్ ఉండబోతోందని క్లారిటీ ఇచ్చారు.


జై హనుమాన్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించి పనులు కూడా జరగబోతున్నాయని ప్రశాంత్ వర్మ మరొకసారి క్లారిటీ ఇచ్చారు.. అందుకు సంబంధించి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయబోతున్నాం అంటే వెల్లడించారు.. హనుమాన్ సినిమాలో చివరి ఐదు నిమిషాల ఎపిసోడ్ని చాలా హైలైట్ గా చేశారు ఇప్పుడు సీక్వెల్ లో మాత్రం అంతకుమించి రెండు గంటల పాటు ఎంటర్టైన్మెంట్ ఉంటుందంటూ కూడా క్లారిటీ ఇచ్చారు.అయితే జై హనుమాన్లో హనుమాన్ గా ఎవరు కనిపిస్తారు అనే విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు.. హీరో రానా పేరైతే చాలా వైరల్ గా మారింది. కానీ మరి ప్రశాంత్ వర్మ అసలు హీరో ఎవరనే విషయం పైన క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: