తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు అందరితోను సినిమాలు చేసిన వ్యక్తి. రజనీకాంత్ తో పాటు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ లతో రవికుమార్ అనేక సినిమాలు చేయడమేకాకుండా వారికి సూపర్ హిట్స్ అందించిన ట్రాక్ రికార్డ్ అతనికి ఉంది. లేటెస్ట్ గా అతడు దర్శకత్వం వహించిన ‘గార్డియన్’ మూవీ ప్రమోషన్ లో రవికుమార్ టాలీవుడ్ సీనియర్ హీరోలతో తనకు ఉన్న పరిచయాలను వారిమనస్తత్వం గురించి కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేశాడు.హీరో బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలకృష్ణ సినిమా షూటింగ్ సమయంలో ఒకోసారి సరదాగా మరొకసారి మూడీగా ఉంటాడని అతడి మూడ్ కు తగ్గట్టుగా యూనిట్ లోని సభ్యులు సద్దుకుపోతూ ఉంటారని తెలియచేశాడు. అంతేకాదు బాలయ్యకు ఏవిషయం మీద కోపం వస్తుందో తెలుసుకోవడం చాల కష్టం అని చెపుతూ బాలయ్య షూటింగ్ సమయంలో అతడి విగ్ కు ఇచ్చే ప్రాధాన్యత గురించి ఒక ఆశక్తికర విషయం తెలియచేశాడు.బాలయ్య షూటింగ్ స్పాట్ లో తన మేకప్ కరిగిపోయినా తన బట్టలు కొద్దిగా నలిగినా పెద్దగా పట్టించుకోడని అయితే అతడి విగ్ కు మాత్రం ఏమాత్రం తేడా జరిగినా సహించడు అని చెప్పాడు. కొంతకాలం క్రితం తాను బాలకృష్ణతో సినిమా తీస్తున్న సమయంలో అది సమ్మర్ కావడంతో బాలయ్య మొఖం మీద చెమట బాగా పట్టడంతో షూటింగ్ స్పాట్ లో ఉన్న ఒక సహాయదర్శకుడు బాలయ్యకు అసౌకర్యం కలగకూడదు అన్న ఉద్దేశ్యంతో స్టాండింగ్ ఫ్యాన్ దాని స్పీడ్ పెంచి బాలయ్య వైపుకు గాలి ఎక్కువగా వచ్చేడట్లు పెట్టడంతో బాలయ్య పెట్టుకున్న విగ్ లోని జుట్టు కొంత చెదరడంతో ఆసహాయ దర్శకుడి పై విపరీతంగా కోపం తెచ్చుకున్న బాలయ్య అతడిని సెట్ నుండి బయటకు పంపించివేసిన సందర్భంలో బాలయ్య ఉగ్రరూపం తాను చూశానని ఆనటి సంఘటను గుర్తుకు చేసుకున్నాడు.అయితే ఆమరునాడు తాను ఆసహాయ దర్శకుడుని బాలయ్య దగ్గరకు తీసుకు వెళ్ళి క్షమించమని కోరడంతో బాలయ్య నిముషాలలో సాంతమూర్తిగా మారిపోయి ఆసహాయ దర్శకుడుని క్షమించిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ బాలయ్య కోపాన్ని అర్థం చేసుకోవడం చాలకష్టం అని అంటున్నాడు..  మరింత సమాచారం తెలుసుకోండి: