మెగా మేనళ్ళుగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ లు తమ సినిమా కెరియర్ విషయంలో ఎదురీత ఈదుతున్నారా అంటూ ఇండస్ట్రీలోని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఉప్పెన’ మూవీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన వైష్ణవ్ తేజ్ ఆతరువాత నటించిన ‘కొండపొలం’ ‘రంగరంగ వైభవంగా’ ‘ఆదికేశవ’ వరస ఫ్లాప్ లుగా మారడంతో ఈ యంగ్ హీరో కెరియర్ పై చాలామందికి సందేహాలు ఏర్పడుతున్నాయి అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.  



‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ‘మట్కా’ మూవీ అతడి కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది. అయితే ఈ మూవీ తరువాత ఈ యంగ్ హీరో చేయబోయే సినిమా పై ఇంకా క్లారిటీ లేకపోవడంతో వైష్ణవ్ కు అవకాశాలు తగ్గిపోయయా అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. వాస్తవానికి సాయి తేజ్ గత సంవత్సరం నటించిన ‘విరూపాక్ష’ సూపర్ సక్సస్ అయినప్పటికీ అతడికి చెప్పుకోతగ్గ స్థాయిలో అవకాశాలు రావడం లేదు అన్న కామెంట్స్ కొందరు చేస్తున్నారు.



సాయి ధరమ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకుని పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ‘బ్రో’ మూవీ సాయి తేజ్ కెరియర్ కు ఏమాత్రం కలిసిరాలేదు అన్న కామెంట్స్ కొందరు చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తీయాలి అనుకున్న తేజ్ కొత్త సినిమా ‘గాంజా శంకర్’ ఆగిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ బడ్జెట్ చాల భారీ స్థాయిలో ఉండటంతో ఈమూవీ విషయమై నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు అన్న గాసిప్పులు వస్తున్నాయి.



ఇది ఇలా ఉంటే ‘హనుమాన్’ నిర్మాత తీయబోయే ఒక మూవీ ప్రాజెక్ట్ కు సాయి తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని అంటున్నారు. ఒక కొత్త దర్శకుడు తీయబోయే ఈమూవీలో సాయి తేజ్ చాల డిఫరెంట్ లుక్ లో కనిపించాలి కాబట్టి ఆమూవీకి సంబంధించిన మేకోవర్  విషయంలో తేజ్ శ్రద్ధ పడుతున్నాడు అన్న వార్తలు కూడ ఉన్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: