ఇప్పుడు ఉన్న మీడియం రేంజ్ హీరోలలో మంచి విష్ణు చాల సీనియర్. అతడు హీరోగా ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా సక్సస్ ఫుల్ హీరోగా మారలేకపోయాడు. మంచు కాంపౌండ్ బ్యాకింగ్ లేకపోతే ఈపాటికే అతడి పేరును ప్రేక్షకులు మర్చిపోయి ఉండేవారు. లేటెస్ట్ గా అతడు కన్నప్ప పాత్రలో నటిస్తూ తీసిన కన్నప్ప మూవీ ఒక సాహసం.వందల కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈసంవత్సరంలో విడుదలకాబోతున్న ఈమూవీ టీజర్ ను చూసినవారు ఆశ్చర్య పోతున్నారు. గ్రాఫిక్స్ పరంగా ఈమూవీ ‘బాహుబలి’ రేంజ్ లో కనిపిస్తూ ఉండటంతో లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీ టీజర్ కు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభిస్తోంది.ఈమూవీ టీజర్ విడుదల సందర్భంలో తాము ఈసినిమాను ఒక భక్తి సినిమాగా తీయడం లేదనీ హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సినిమాగా తాను తీస్తున్నాను అంటూ మంచు విష్ణు క్లారిటీ ఇవ్వడంతో ఈమూవీ ఒక భక్తి సినిమాగా కాకుండా ఒక యాక్షన్ సినిమాగా చూపెడుతూ కన్నప్ప జీవితంలోని కొన్ని అరుదైన సంఘటనలు తెలుసుకుని ఈమూవీని చాల డిఫరెంట్ గా తీశాను అని అంటున్నాడు. అయితే ఈసినిమా ఘనవిజయం సాధిస్తుందని విష్ణు మంచి నమ్మకంలో ఉన్నాడు.అయితే మంచు విష్ణు ఈసినిమా ప్రమోషన్ విషయంలో సోమవారం సెంటిమెంట్ ను పాటించబోతున్నట్లు తెలియచేసి చాలమందికి షాక్ ఇచ్చాడు. మహాశివుడు కి సోమవారం అంటే చాల ఇష్టం కాబట్టి ఈనిమాకు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ ఇక నుంచి సోమవారం మీడియాకు విడుదల చేస్తూ ఉంటామని క్లారిటీ ఇచ్చాడు. నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ మూవీ అప్ డేట్స్ అన్నీ శనివారం వస్తున్న నేపధ్యంలో కన్నప్ప అప్ డేట్స్ అన్నీ సోమవారం వస్తాయి అనుకోవాలి. అయితే బాపు తీసిన ‘భక్తకన్నప్ప’ మూవీని ఇప్పటికే తెలుగు వాళ్ళందరు అనేకసార్లు చూసిన పరిస్థితులలో ఈ కొత్త కన్నప్ప ప్రయోగాన్ని ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: