గత వారం రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు కన్నడ యాక్టర్ దర్శన్, నటి పవిత్ర గౌడ .. ముఖ్యంగా అభిమాని మర్డర్ కేసులో జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నారు దర్శన్.. ముఖ్యంగా రేణు స్వామి అనే వ్యక్తిని మర్డర్ కేసులో దర్శన్ పోలీసులు కూడా అరెస్టు చేశారు తను ప్రియురాలు పవిత్ర గౌడ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కోపంతోనే రేణుక స్వామిని హతమార్చారనే విషయాలు తెరపైకి వచ్చాయి. దీంతో పవిత్ర గౌడతో పాటు మరొక 11 మందిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లుగా సమాచారం.


అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసులో కొన్ని నిజాలు బయటకి వస్తూ ఉన్నాయి. పోలీసులు తెలిపిన ప్రకారం రేణుకా స్వామి హత్య అనంతరం 9వ తేదీన ఉదయం తెల్లవారుజామునే హీరో దర్శన్ రేణుక స్వామి మృతి దేహాన్ని సైతం తన భార్య విజయలక్ష్మి ఫార్మ్ హౌస్ కి తీసుకువెళ్లారని అక్కడి నుంచి మైసూర్ కి బయలుదేరే ముందే తన ఇంట్లో పూజలు కూడా చేయించారని సమాచారం. ఈ విషయం పోలీసులకు తెలియగానే దర్శన్ భార్యకు కూడా సామాన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో విచారణ కూడా చేపట్టారు.అయితే ఇది జరిగిన మూడు రోజులకు దర్శన్ మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం కూడా మరొకసారి సర్వత్ర చర్చనీయాంశంగా మారినది. బెంగళూరులోని దర్శన్ కు చెందిన ఫామ్ హౌస్ లో శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య పైన కూడా పోలీసులు విచారణ చేయబడుతున్నారు సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ తో పాటు వీడియో సమాచారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ లెటర్ తో పాటు వీడియోని కూడా శ్రీధర్ వెల్లడించారు. మరి ఈ కేసులో మరేన్ని ట్వీస్టులు బయటికి వస్తాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: