పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఉపాసన కొణిదెల. "నా డార్లింగ్ క్లీంకారకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు.నీరాకతో మా జీవితాలు పరిపూర్ణమయ్యాయి. మా అందరి జీవితాల్లో ఆనందం నింపినందుకు థాంక్యూ" అంటూ తమ కూతురికి విషెస్ తెలిపింది. ఉపాసన షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. రామ్ చరణ్ కూతురికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు సినీ నటీనటులు
మెగాస్టార్ చిరంజీవి ముద్దుల మనవరాలు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాలపట్టి.. మెగా ప్రిన్సెస్ క్లింకారా మొదటి పుట్టినరోజు నేడు. దీంతో చరణ్ ముద్దుల తనయకు సినీ సెలబ్రెటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతూ నెట్టింట వరుస పోస్టులు చేస్తున్నారు.తన ముద్దుల కూతురు బర్త్ డే కావడంతో ఎమోషనల్ వీడియో షేర్ చేస్తూ క్లీంకారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఉపాసన కొణిదెల. "నా డార్లింగ్ క్లీంకారకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీరాకతో మా జీవితాలు పరిపూర్ణమయ్యాయి. మా అందరి జీవితాల్లో ఆనందం నింపినందుకు థాంక్యూ" అంటూ తమ కూతురికి విషెస్ తెలిపింది ఉపాసన.

 ఉపాసన షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. రామ్ చరణ్ కూతురికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు సినీ నటీనటులు. లిటిల్ వండర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. హ్యాపీ బర్త్ డే లిటిల్ స్టార్ అంటూ రకుల్ ప్రీత్ సింగ్.. హ్యాపీ ఫస్ట్ బర్త్ డే అంటూ కియారా అద్వానీ రిప్లై ఇచ్చారు.వీరితోపాటు మెగా ఫ్యాన్స్ కూడా మెగా ప్రిన్సెస్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ క్లీంకార ఫోటోస్ షేర్ చేస్తున్నారు. గతేడాది జూన్ 20న రామ్ చరణ్, ఉపాసన దంపతులకు క్లీంకార జన్మించగా.. అపోలో ఆసుపత్రి బయటే మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. కొణిదెల యువరాణి వచ్చిందంటూ మురిసిపోయారు.క్లీంకార జన్మించి ఏడాది పూర్తైన ఇప్పటివరకు క్లీంకార ముఖం చూపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఉపాసన, చరణ్ దంపతులు. అయితే కొన్ని రోజుల క్రితం చరణ్, ఉపాసన కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లగా అనుకోకుండా క్లీంకార ఫేస్ కొంచెం రివీల్ అయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: