తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా సినిమా ఇప్పటికే ఏకంగా రూ.50 కోట్ల వసూళ్లు క్రాస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మొదటి రోజు కంటే రెండో రోజు, మూడో రోజు అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సంగతి తెల్సిందే.ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న మహారాజా సినిమా తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ వర్షన్ తో అనుకున్న దాని కంటే ఎక్కువగానే వసూళ్లు సాధించినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్‌ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు వసూళ్ల సందడి కొనసాగే అవకాశాలు ఉన్నాయని సమాచారం తెలుస్తోంది.గత వారం వచ్చిన సినిమాలతో పోటీ పడి నిలిచిన మహారాజా సినిమాతో పోల్చితే ఈ వారం రిలీజ్ అయిన సినిమాలను పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదైన అద్భుతం జరిగితే తప్ప ఈ వారం విడుదలయిన సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కనబడటం లేదు. 


కాబట్టి ఈ వారం రోజులు కూడా మహారాజా సినిమా కే మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఈనెల 27వ తేదీన ప్రభాస్‌ కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రభాస్‌ భైరవగా నటించిన కల్కి మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కాబట్టి కల్కి సినిమా వచ్చే దాకా మహారాజా సినిమా సందడి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కల్కి సునామిలో మహారాజా సినిమా కనిపించే అవకాశాలు ఉండవు. కాబట్టి మహారాజా గా విజయ్ సేతుపతి ఈ అయిదు రోజుల పాటు ఎంత వీలు అయితే అంత భారీ వసూళ్లు చేసుకోవాల్సి ఉంటుంది. కల్కి మూవీ పై ఉన్న అంచనాల నేపథ్యంలో ఆ సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో మహారాజా సినిమా అప్పటి దాకా బరిలో ఉండే అవకాశం లేదు. కాబట్టి ప్రభాస్ రాక ముందే బాక్సాఫీస్ వద్ద సాధ్యం అయినంత సర్దేసుకోవాలని మహారాజా మూవీ మేకర్స్ కూడా భావిస్తున్నారట.చూడాలి కల్కి 2898 ఏడి సినిమా వచ్చేదాకా మహారాజా ఎన్ని కోట్ల వసూళ్లు రాబడుతాడనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: