కథ
నాని (పవన్ కుమార్) చదువల్లో అంతంత మాత్రమే. మంచి ర్యాంక్ రాకపోవడంతో ఇంట్లో నాన్న తిడుతుంటాడు. ఏదో ఒక కాలేజ్‌లో చేరి నాని బీటెక్ చదువుతుంటాడు. అలా కాలేజీలోకి ఎంటర్ అయిన నాని సీనియర్ సారా (స్నేహా)ని చూసి ప్రేమిస్తాడు. వారిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుంది. అయితే నాని సీనియర్ అవుతాడు. ఇక జూనియర్‌తో ఫ్లర్టింగ్, సీనియర్‌తో ప్రేమ అంటూ నాని లైఫ్ జాలీగా వెళ్తుంది. నాని జీవితంలో అమ్మ, అక్క, నాన్నల పాత్ర ఏంటి? నాని ప్రేమ కథలు ఎక్కడి వరకు వెళ్తాయి.. జాలీగా తిరుగుతూ ఉండే నాని జీవితంలో ఏం జరుగుతుంది? సక్సెస్ అన్నది నానికి వస్తుందా? లేదా? అన్నది కథ.
నటీనటులు
పవన్ కుమార్ నాని పాత్రలో చూపించిన ఎమోషన్స్, షేడ్స్ అన్నీ అద్భుతంగా అనిపిస్తాయి. ఓ కాలేజీ కుర్రాడు ఎలా అయితే ఉంటాడో తెరపై నాని అలానే కనిపించాడు. రొమాన్స్, ఎమోషన్స్, యాక్షన్ ఇలా అన్ని యాంగిల్స్‌లో మెప్పిస్తాడు. ఈ చిత్రానికి హీరోయిన్ల గ్లామర్ ప్రధాన ఆకర్షణ. స్నేహా, సాహిబా ఇద్దరూ తెరపై అందంగా కనిపించారు. ఝాన్సీ నటన ఎంతో సహజంగా అనిపిస్తుంది. రాజీవ్ కనకాల ఉన్నంతలో తన అనుభవం చూపించారు. మిగిలిన పాత్రలన్నీ ఓకే అనిపిస్తాయి.
విశ్లేషణ
ఫస్ట్ హాఫ్ అంతా జాలీగా సాగినట్టు అనిపిస్తుంది. నాని ఇంట్రడక్షన్, కాలేజ్ సీన్లు, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్.. చిన్నపాటి గొడవలు.. రొమాన్స్.. యాక్షన్ అంటూ ప్రథమార్దం సాఫీగా సాగుతుంది. ఇంటర్వెల్‌కు కథ ఎమోషనల్‌గా టర్న్ అవుతుంది. సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ అక్కడ బాగానే వర్కౌట్ అవుతుంది. ఇక కీలకమైన సెకండాఫ్ ఫుల్ ఎమోషనల్‌గా ఉంటుందని భావిస్తారు. కానీ మళ్లీ ఎంటర్టైన్మెంట్ జోన్‌లోకి కథ వస్తుంది.
ఓ యావరేజ్ స్టూడెంట్ జీవితం ఎలా ఉంటుంది.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఏంటి? అన్నది చక్కగా చూపించాడు దర్శకుడు. అన్ని రకాల ఎమోషన్స్‌ను మిక్స్ చేసి పవన్ కుమార్ ఫుల్ ఎంగేజింగ్‌గా తెరకెక్కించాడు. ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ బాగా వర్క్ అవుట్ అయింది. సంగీతం బాగుంది.రాలే పువ్వా సాంగ్ కి థియేటర్ లో విజిల్స్ పడతాయి. క్లైమాక్స్ లో వచ్చే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి.
టెక్నికల్‌గా సినిమా హై స్టాండర్డ్‌లో అనిపిస్తుంది. విజువల్స్ చాలా రిచ్‌గా ఉంటాయి. పాటలు వినసొంపుగా ఉంటాయి. తెరపై మరింత అందంగా చిత్రీకరించారు. మాటలు గుండెను హత్తుకునేలా ఉంటాయి. సినిమా కోసం టీం మెంబర్లు పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది.యావరేజ్ స్టూడెంట్ నాని ఆడియెన్స్‌ను మెప్పించేందుకు చాలానే ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో పూర్తిగా కాకపోయినా చాల వరకు సఫలం అయినట్టుగా కనిపిస్తుంది.
రేటింగ్ 3
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి