ఇది స్వయంగా చరణ్ చెప్పిందే. మగధీరకు ముందు ఆయన తండ్రి చిరంజీవి సింహాద్రి చూశారట. ఒక్కసారిగా మైండ్ బ్లోయింగ్ అనిపించే రేంజ్ లో జక్కన్న దర్శకత్వం చూసి నోట మాట రాలేదట. అంత మెగా స్టార్ నే కేవలం రెండో సినిమాతోనే మెప్పించిన దర్శక ధీర అప్పట్లోనే ఏ స్థాయిలో ప్రభావం చూపించారో ఈ ఉదాహరణను బట్టి అర్థం చేసుకోవచ్చు. కొంచెం ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తే సింహాద్రి టైంలో చిరుకి గట్టి పోటీ ఇచ్చేవాడు వచ్చాడంటూ అప్పటి కొన్ని మీడియా సాధనాల్లో తారక్ పై కథనాలు వచ్చేవి. దానికి తగ్గట్టే సింహాద్రి ఆ టైంలో నెలకొల్పిన రికార్డులు మామూలువి కాదు.చరణ్ జక్కన్న డైరెక్షన్ గురించి కామెంట్స్ చేసిన వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైరల్ అవుతున్నారు. 20 సంవత్సరాల వయస్సులో జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాలో బరువైన పాత్రను పోషించి తన నటనతో మెప్పించారు.జూనియర్ ఎన్టీఆర్ ఏడో సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో క్రియేట్ చేసిన రికార్డులు సైతం అన్నీఇన్నీ కావు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబోలో నాలుగు సినిమాలు తెరకెక్కగా ఈ నాలుగు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశాయనే చెప్పాలి. చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కూడా స్నేహం ఉందనే సంగతి తెలిసిందే.చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలన్నీ ఒకింత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. చరణ్ తారక్ లకు భాషతో సంబంధం లేకుండా క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే చరణ్, తారక్ నటించిన సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయనే సంగతి తెలిసిందే.