సాధారణంగా స్టార్ హీరోలు ఏదైనా బ్రాండ్ కి ప్రమోషన్ చేశారు అంటే చాలు అభిమానులు అవి తప్పకుండా వాడాలని అనుకుంటూ ఉంటారు. ఇలా హీరోలు చేసే వానిజ్య ప్రకటనల ద్వారా బాగా ప్రభావితం అవుతూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది స్టార్ హీరోలు మాత్రం ఏకంగా పాన్ మసాలా వాణిజ్య ప్రకటనలు చేయడం.. తీవ్ర విమర్శలకు దారితీస్తూ ఉంది. ఇక సోషల్ మీడియాలో ఆయా స్టార్ హీరోలఫై ఎంతోమంది నేటిజన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇలా పాన్ మసాలా యాడ్స్ చేస్తున్న స్టార్ హీరోలు ఇక ఫిట్నెస్ గురించి కూడా చెబుతూ ఉన్నారు.
అయితే ఇలా ఫిట్నెస్ గురించి మాట్లాడుతూనే.. పాన్ మసాలా బ్రాండ్లకు ప్రోత్సహిస్తూ వాణిజ్య ప్రకటనలు చేస్తున్న స్టార్ హీరోలను ఉద్దేశిస్తూ బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహం షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో జాన్ అబ్రహం మాట్లాడుతూ.. నేను నా జీవితాన్ని నిజాయితీతో జీవిస్తే నేను చెప్పేది ప్రతిదీ కూడా ఆచరిస్తా. అలా ఆచరిస్తే నేను ఒక రోల్ మోడల్. నేను పబ్లిక్ లోను నటిస్తూ చావును అస్సలు అమ్మబోను అంటూ జాన్ అబ్రహం చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోలు పాన్ మసాలా యాడ్స్ చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నామ్.