ఇక పోతే ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు కలెక్షన్ల పరంగా కూడా టార్గెట్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా బాగుందని అందరూ అనడమే కాదు మూడు రోజుల్లోనే రూ.6.04 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. మొత్తానికైతే నిర్మాత గా నిహారిక పాస్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరో మూడు రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం రానుంది. పైగా ఆగస్టు 15న రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలు విడుదల కానున్నాయి.
మరి బడా సినిమాలను తట్టుకొని నిహారిక సినిమా ఏ మేరకు నిలబడుతుందో చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఈమె ఇప్పుడు సక్సెస్ అయినట్లే అంటూ వార్తలు వినిపిస్తుంది. మంచి పల్లె టూరు వాతావరణం లో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలు ఇలా అన్నింటినీ కలగలిపి కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది.