హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా విడుదలకు ముందు మంచి బజ్ తెచ్చుకుంది. ప్రమోషన్లతో పాటు హరీశ్ శంకర్ కామెంట్లతో బాగా హైప్ వచ్చేసింది. దానికి తోడు పాటలు ఆకట్టుకోవడం, ట్రైలర్ బాగుండటంతో ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. అయితే, మిస్టర్ బచ్చన్ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ బుధవారం  సాయంత్రమే ప్రీమియర్ల షోలతో ఈ చిత్రం రాగా.. గురువారం పూర్తిస్థాయిలో రిలీజ్ అయింది. ఈ మూవీకి ప్రీమియర్ల నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. చివరకి వీకెండ్స్ కూడా వర్కవుట్ అయ్యేట్లు కనపడటం లేదు.

 అందుకు కారణం ఎవరు అనేది డిస్కషన్ గా మారింది. ఈ సినిమా ఫెయిల్యూర్ కు హరీష్ శంకర్ కారణం అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ కు అసలు కారణం ఎవరు..ఎక్కడ పొరపాటు జరిగింది. ఎవరూ కావాలని సినిమా ఫెయిల్యూర్ చేసుకోరు కదా ...ఎక్కడ తప్పు ఉంది. అంటే రవితేజ వైపు నుంచే సమస్య అంటున్నారు.  భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయిల షేర్ లోపే వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. సినిమా ఇంత పెద్ద ఫ్లాప్ అయ్యింది అని తెలిసినప్పటికీ కూడా హరీష్ శంకర్ తన మూవీ టీం తో కలిసి

 మొదటిరోజే సక్సెస్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇదంతా పక్కన పెడితే గతం లో హరీష్ శంకర్ రవితేజ తో ‘మిరపకాయ్’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని చేసాడు. ఈ సినిమాలో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ కి స్నేహితురాలిగా స్నిగ్ద అనే అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయి డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఆమె చెప్పిన ప్రతీ డైలాగ్ లోనూ కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. ఈమె మరెవరో కాదు హరీష్ శంకర్ భార్య అని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: