తమ దాంపత్య బంధానికి డీవర్స్ తీసుకోబోతున్నట్లుగా జయం రవి ప్రకటించడం జరిగింది.తన వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఈ విషయం పైన ఎలాంటి పుకార్లు ఆరోపణలు చేయవద్దండి అంటూ జయం రవి కోరడం జరిగింది. 2003 లో జయం తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జయం రవి.. అప్పటి నుంచి ఆయన పేరు జయం రవిగా పేరు మార్చుకున్నారు. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ చిత్రాలతో మంచి క్రేజ్ అయితే సంపాదించుకున్నారు.
తను నటించిన తమిళ చిత్రాలను కూడా తెలుగులో డబ్బింగ్ తో విడుదల చేసి మంచి క్రేజీ సంపాదించుకున్న జయం రవి. ఈయన సినిమాలు చూడడానికి కూడా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు.జయం రవి, ఆర్తి 2009 జూన్ లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ వికీరి అరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. అయితే ఈ విషయం విన్న అభిమానుల సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. గతంలో జయం రవి భార్య ఆర్తి తన భర్తకు సంబంధించిన ఫోటోలను డిలీట్ చేయడంతో రూమర్ మొదలవగా ఇప్పుడు ఎట్టకేలకు ఈ విషయం నిజం అవ్వడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విడాకులు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మరి వీరిద్దరూ విడిపోవడానికి గల కారణం ఏంటో తెలియజేస్తారేమో చూడాలి.