
ఇందులో శ్రీలీల కేవలం ఐటెం సాంగ్ లో మాత్రమే నటించింది. శ్రీ లీల ఐటమ్ సాంగ్ లో నటించిన ఇదే మొదటిసారి చివరిసారి అని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే శ్రీలీలకు ఐటమ్ సాంగ్ లో నటించడం పెద్దగా ఇష్టం లేదట. కేవలం అల్లు అర్జున్ తో డ్యాన్స్ చేయాలనే కోరికతోనే అతనితో నటించిందని సమాచారం అందుతుంది. ఈ పాటలో తన డ్యాన్స్ తో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పాటలో శ్రీలీల, అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులు వేసింది.
కిసాక్ పాటలో డ్యాన్స్ చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ శ్రీ లీల ప్రైవేట్ పార్ట్స్ ను టచ్ చేసాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయాన్ని తాజాగా బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ శ్రీలీలను టార్చర్ చేశాడని, కావాలనే తన ప్రైవేట్ పార్ట్స్ పైన చేయి వేసి ఇబ్బంది పెట్టాడని ఉమైర్ సందు ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ చూసిన చాలామంది ఉమైర్ సందుపై నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ అలాంటివాడు కాదని కేవలం అది పాట వరకు మాత్రమే అంటూ ఉమైర్ సందుపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతోంది. మరి ఈ విషయంపైన శ్రీ లీల, అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాలి.