
ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కూడా త్వరలోనే రాజకీయాలలోకి వస్తానని తెలిపింది. ఈ విషయం విన్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.. గత ఏడాది తాను ప్రేమించిన సచ్ దేవ్ నికొలయ్ ను పెళ్లి చేసుకోవడం జరిగింది. వివాహమైన కూడా నటనకు దూరంగా ఉండకుండా పలు సినిమాలలో నటిస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్. విశాల్ తో కలిసి నటించిన మదగజరాజా సినిమా 12 ఏళ్ల తర్వాత విడుదలై ఈ సంక్రాంతికి విజయాన్ని అందుకుంది.
అలాగే సోషల్ మీడియాలో వచ్చే వదంతుల పైన కూడా నెగటివ్ కామెంట్ల పైన తను స్పందిస్తూ ఇలాంటివి అనవసరంగా వదంతులు తాను అసలు పట్టించుకోనని.. విమానాశ్రయానికి ఒకసారి బయలుదేరుతున్న సమయంలో అత్యవసరంగా వెళ్లాల్సి ఉండగా చాలామంది వచ్చి ఫోటోలని తీసుకున్నారని అప్పుడు ఒక అతను వచ్చి ఫోటో అడగగా తనకు సమయం మించి పోవడంతో తాను వద్దని చెప్పాను దీంతో అతను తనతో ఫోటో దిగనివ్వలేదని మీరు నటనలోకి ఎందుకు వచ్చారు అంటూ కామెంట్స్ చేశారు అలాంటి వారికి అసలు బుద్ధి లేదంటూ తెలిపింది. తాను రాజకీయాలలోకి రావడానికి కొంతమేరకు సమయం ఉందని తనకు దివంగత ముఖ్యమంత్రి అయిన జయలలిత అని స్ఫూర్తి రాజకీయాలలోకి రావాలని తెలియజేసింది వరలక్ష్మి శరత్ కుమార్. మరి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.