
అయితే ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలు స్లోగా ఉన్నా ప్రేక్షకులను మెప్పిస్తాయి కాబట్టి సారంగపాణి జాతకం సినిమాతో సైతం అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి. కోర్ట్ సినిమాతో ప్రశంసలు అందుకున్న ప్రియదర్శి కంటెంటె బేస్డ్ సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రతి సందర్భంలో సక్సెస్ ను అందుకున్నారనే సంగతి తెలిసిందే.
ఈ నెల 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. వాస్తవానికి ఈ నెల 18వ తేదీనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడింది. రూపా కోడువయూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ప్రియదర్శి, రూప జోడీ బాగుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియదర్శి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పెరుగుతున్నాయి.
ప్రియదర్శి తన కామెడీ టైమింగ్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియదర్శి రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. ప్రియదర్శి కెరీర్ పరంగా మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. ప్రియదర్శి కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీని కమెడియన్ల కొరత కూడా వేధిస్తోందనే సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో సరైన కమెడియన్లు దొరకడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్టార్ కమెడియన్ ప్రియదర్శి ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.