సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే నటన టాలెంట్ తో పాటు అందం కూడా ఎక్కువగానే ఉండాలి. అలా కొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగి తిరిగి జీవితాలు కూడా  పోగొట్టుకున్న వారు ఉన్నారు. అలా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి అవకాశాలు అందుకున్న కథానాయికల్లో  గజాల ఒకరు.. ఎంతో కష్టపడి సినిమా ఫీల్డ్ లోకి వచ్చి  తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. జగపతిబాబు హీరోగా నటించిన 'నాలో ఉన్న ప్రేమ' అనే చిత్రం ద్వారా 2001లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్లింది. అలాగే ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో వచ్చినటువంటి స్టూడెంట్ నెంబర్ వన్ అనే చిత్రంలో కూడా ఆఫర్ అందుకొని  స్టార్ హీరోయిన్ గా మారింది. 

సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆమె పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే గజాల పేరు మార్మోగిపోయింది. అలాంటి ఈమెకు ఏమైందో ఏమో కెరియర్ మంచి పొజిషన్ లో ఉన్న సమయంలోనే 2002లో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. 2002 జూలై 22న హైదరాబాదులోని ఒక అపార్ట్మెంట్ లో ఆమె నిద్ర మాత్రలు మింగి ఆపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఇదంతా గమనించినటువంటి స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ఆమె బ్రతికి బట్ట కట్టింది. అయితే గజాల సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం ప్రేమ వ్యవహారమే అని అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి.

సూసైడ్ అటెంప్ట్ తర్వాత ఇండస్ట్రీకి కాస్త దూరమైన ఈమె హిందీ నటుడు అయినటువంటి ఫైజల్ రజాకాన్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమై కుటుంబానికి బాసటగా నిలుస్తూ హ్యాపీగా జీవిస్తుందని చెప్పవచ్చు. అయితే ఆమె సూసైడ్ గురించి  మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో గజాల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఎన్టీఆర్ తో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: