
అయితే జనవరి , ఫిబ్రవరి మార్చ్ తర్వాత ఏప్రిల్ లో కూడా డల్ మూమెంట్ ఏ కనిపించింది .. సింగిల్ థియేటర్లో హౌస్ ఫుల్ బోర్డులు చూసి చాలా రోజులు అవుతుంది .. ఇదే విషయాన్ని టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా చెబుతున్నారు .. ఇక దీనికి కారణం ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లేవని పలువురి భావన . అయితే ఏప్రిల్ నెలలో కూడా పెద్దగా ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేసే సినిమాలు అయితే లేవు .. ఇప్పటికే రిలీజ్ అయిన ‘ఓదెల-2’ కి మిక్స్డ్ టాక్ వచ్చింది .. ‘అర్జున్ S/O వైజయంతి’కి మంచి రిజల్ట్ వస్తే కొంతమేర థియేటర్లకు రిలీఫ్ కలుగుతుంది ..
కానీ పూర్తిస్థాయిలో థియేటర్లు జనాలతో నిండాలంటే సినిమాపై సాలిడ్ బజ్ రావాల్సిందే .. ఇక ఇలాంటి బజ్ క్రియేట్ చేసిన సినిమా హిట్ 3 మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. దీంతో ఇప్పుడు అందరూ చూపు ఈ సినిమా పైన ఉంది .. హీరో నాని కూడా ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ కథలో దమ్ముంటేనే సినిమా ను చూడండి అనే విధంగా కామెంట్లు చేస్తున్నాడు . దీంతో ఈ సినిమా ఒక్కటే థియేటర్లకు ఇప్పుడు పెద్ద దిక్కుగా మారిందని పలువురు సినీ విశ్లేషకులు అంటున్నారు .. ఇక మరి నిజంగానే టాలీవుడ్ డల్ మూమెంట్ కు హిట్-3 చెక్కు పెడుతుందా లేదా అనేది చూడాలి ..