సినీ హీరో రాజ్ తరుణ్, లావణ్య వివాదం గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. ఇందులో ఎంతోమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయానికి ఇప్పట్లో తెరపడేలా మళ్లీ కనిపించడం లేదు. ఇటీవలే రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఇంటిలోకి రానివ్వలేదంటు ఇంటి ముందర ధర్నా చేయడంతో..పోలీసులు సైతం లావణ్య ఇంటికి వెళ్లి మరి రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లో ఉంచేలా చేశారు. అయితే ఆమె మళ్ళీ తిరిగి కేసులు పెట్టి తనని హింసించారనే విధంగా తెలియజేసింది. తాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లావణ్య పలు విషయాలను తెలిపింది.


లావణ్య మాట్లాడుతూ.. ఒక రాజకీయ నాయకుడు తాలూకా వ్యక్తులు తన దగ్గరికి వచ్చారని.. 2021లో తాను రాజ్ తరుణ్ డబ్బులు తీసుకున్నామని అది కూడా 55 లక్షల రూపాయలు.. ప్రస్తుతం ప్రభుత్వంలో ఆ వ్యక్తి కూడా మంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆ మంత్రి కూడా తమ ఫ్యామిలీకి మంచి స్నేహితుడని తెలిపింది. నాలుగు సంవత్సరాల క్రితం అవసరాల కోసం 55 లక్షలు తీసుకున్నాము అయితే అప్పుడు ఆ ఇంటి పేపర్లు తాకట్టుపెట్టే డబ్బులు తీసుకున్నామని తెలిపింది లావణ్య. అది కూడా రూపాయి నర్ర ఇంట్రెస్ట్ చొప్పున డబ్బులు తీసుకున్నప్పటికీ రెండేళ్ల నుంచి అసలు ఇంట్రెస్ట్ ఏ కట్టడం లేదని తెలియజేసింది.



నిన్నటి రోజున సాయంత్రం మంత్రి తాలూకా మనుషులు కూడా ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని డబ్బులు ఇచ్చేందుకు కొంత సమయం కూడా ఇవ్వాలని ఆ మంత్రికి సంబంధించిన వ్యక్తులను కూడా కోరానని తెలిపింది లావణ్య. ఒకవేళ డబ్బులు ఇవ్వని పక్షంలో కూడా ఆ ఇంటిని అప్పజెప్పాలంటూ ఆ వ్యక్తులు చెప్పారని దీంతో తాను ఇంటిని ఖాళీ చేసి  ఆ వ్యక్తులకు ఐదు రోజులలోపు ఇచ్చేస్తానని తెలియజేసింది లావణ్య. మొత్తానికి రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో ఇప్పుడు మంత్రి ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: