
దర్శక ధీరుడు రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్లో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న SSMB 29 సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే .. అయితే ఈ సినిమా కు సంబంధించి ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం మహేశ్ , ప్రియాంక , పృథ్వీరాజ్‌తో పాటు దాదాపు 3,000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ షూటింగ్ లో పాల్గొనబోతున్నారంటూ .. ఓ వార్త బయటికి వచ్చింది .. మే నుంచి జూన్ వరకు ఈ సీక్వెన్స్ కు సంబంధించిన షూటింగ్ జరగబోతుందట . ఇక దీని కోసం ప్రస్తుతం హైదరాబాదు లో ఓ భారీ సెట్ ను కూడా రెడీ చేస్తున్నార ని తెలుస్తుంది . అన్నట్టు ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ నేతృత్వం లో ఈ భారీ యాక్షన్ సన్నివేశాల ను తెరకెక్కించనున్నారు .
అయితే ఇక్కడ ఏది ఏమైనా ఈ పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు అని ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .. కాగా రీసెంట్ గా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా స్టోరీ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. నేను రాజమౌళి ఇద్దరం దక్షిణ ఆఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం .. అందుకే ఆయన పుస్తకాలు ఆధారం గానే ఈ సినిమా స్క్రిప్ట్ ను తయారు చేస్తామంటూ చెప్పుకోచ్చారు . అయితే ఇప్పుడు ఈ రాజమౌళి మహేష్ సినిమా కూడా అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుందని కూడా చెప్పేశారు .. ఈ సినిమా కి కీరవాణి సంగీతం అందిస్తున్నారు .. విజయేంద్ర ప్రసాద్ కథ అందించ గా.. దర్శకుడు దేవా కట్టా డైలాగులు , సంభాషణలు అందిస్తున్నారు ..