
తాజాగా ఈ వరంగల్ కుర్రాడు ఒక లగ్జరీ కారు కొన్నట్లుగా తెలుస్తోంది. అది కూడా తన గర్ల్ ఫ్రెండ్ అయినా అధ్యారెడ్డితో కలిసి XUV700AX7 లగ్జరీకాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఈ విషయాన్ని అటు అభిమానులతో కూడా పంచుకుంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా షేర్ చేశారు నబిల్. ఎప్పటికైనా తనకు ఇలాంటి కారు కొనాలన్నదే కళ అందుకే ఈ లగ్జరీ కారుని కొన్నానంటూ తెలియజేశారు దీంతో తన కల పూర్తి అయ్యిందని తెలిపారు.
మొదట సున్న సబ్స్క్రైబర్స్ నోట్ ప్యాడ్ తో, సున్నా ఫాలోవర్స్ తో ఒక సాధారణ యూట్యూబర్గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టానని తన ప్రయాణంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నాను ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపానని వాటన్నిటికీ కష్ట ఫలితమే ఇది నా లైఫ్ లో ఒక మైలురాయిగా మిగిలిపోయింది ఇది సాధ్యం అవ్వడానికి కారణమైన ప్రతి ఒక్కరిని మరిచిపోలేనని ఇలాంటివి మీరు కూడా సాధ్యమవుతుంది కలలు కనండి కలలు సహకారం చేసుకునే దిశగా అడుగులు వేయండి అంటూ ఒక సందేశాన్ని తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. అయితే ఈ కారు ధర 26 లక్షల వరకు ఉంటుందట.