తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా సంపూర్ణేష్ బాబు తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకొని బర్నింగ్ స్టార్ గా పేరు సంపాదించారు. హృదయ కాలేయం సినిమాతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో ఎటువంటి అంచనాల లేకుండా భారీ విజయాన్ని అందుకున్న సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించి బాగానే పేరు సంపాదించారు. ప్రస్తుతం ఎన్ మోహన్ మేనం డైరెక్షన్లో సంతోష్ హీరోగా నటిస్తున్న చిత్రం సోదరా.. ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లో రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం పాల్గొన్నారు.


హీరో సంపూర్ణేష్ బాబు కూడా వరుస ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాల గురించి కూడా తెలియజేశారు. ఇక సినిమాలలో కొంతమేరకు గ్యాప్ రావడం ఆర్థిక పరిస్థితుల పైన కూడా వివరించారు. తాను హీరోగా పదకొండేళ్లు పూర్తి చేసుకోవడం తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఈ ప్రయాణం తనకి చాలా ఆనందంగా అనిపించిందని.. సినిమాల వల్లే తాను ఈ క్రేజ్ ఏర్పరచుకున్నారని తెలిపారు. కానీ ఈ క్రేజ్ ని తాను ఎక్కువ రోజులు ఎంజాయ్ చేయలేకపోయానని తెలిపారు.


అలాగే ఇప్పటికి తన భార్య ఉమారాణి మిషన్ కుడుతూ ఉన్నదని తనకు ఇద్దరు ఆడపిల్లలు కాక ఒకరు బీటెక్ చదువుతూ ఉండగా మరొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారని తెలిపారు. తన పిల్లలు మాత్రం నరసింహచారి పిల్లలుగానే చాలా సింపుల్ గా చదువుకుంటూ ఉన్నారని. అందరి పిల్లలలాగే బస్సులలో వెళ్లి ఆటోలలో తిరుగుతూ చదువుతున్నారని.. సినిమాలలో ఎక్కువగా కనిపించకపోవడంతో తను అనారోగ్య పాలయ్యానని తప్పుడు రూమర్లు సృష్టించారు. తాను అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని రూమర్లు కూడా సృష్టించారు.అందులో నిజం లేదని తాను సినిమాలలో చేస్తూ ఉన్నాను కానీ అనుకున్న సమయానికి అవి రిలీజ్ కాలేదు అంతే అంటూ తెలిపారు సంపూర్ణేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: