తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో నాని ఒకరు. నాని ఎప్పుడు ఒక సినిమాలో నటిస్తూ మరో ఒకటి , రెండు సినిమాలను లైన్లో పెట్టి మొదటి మూవీ పూర్తి కాగానే మరో మూవీ ని స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇకపోతే ప్రస్తుతం నాని తాజాగా హిట్ 3 మూవీ ని కంప్లీట్ చేశాడు. అలాగే ది ప్యారడైజ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ తో పాటు మరో నాలుగు మూవీలను కూడా నాని ఓకే చేసుకున్నాడు. మొత్తంగా నాని తన అప్కమింగ్ ఐదు మూవీలను ఇప్పటికే రెడీ చేసి పెట్టుకున్నాడు. మరి నాని అప్కమింగ్ ఐదు మూవీలు ఏ దర్శకులతో చేయబోతున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం.

నాని తన తదుపరి మూవీ ని శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ది ప్యారడైజ్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత నాని తమిళ దర్శకుడు అయినటువంటి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా నానిమూవీ చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ దర్శకులలో ఒకరు అయినటువంటి సుజిత్ దర్శకత్వంలో కూడా నానిమూవీ కి కమిట్ అయ్యాడు. ఇక తమిళ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి సీబీ చక్రవర్తి దర్శకత్వంలో కూడా నానిమూవీ కి కమిట్ అయినట్లు తెలుస్తుంది. ఇలా నాని తన అప్కమింగ్ ఐదు మూవీలను ఇప్పటికే సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: