సాధారణంగా స్టార్ హీరోస్ సినిమాలు తెరకెక్కించేటప్పుడు డైరెక్టర్ లు చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు . హీరో పేరెంట్స్ ఏమనకపోయినా ..స్టార్ హీరోస్ కి ఏ ప్రాబ్లం లేకపోయినా.. వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం తెగ అల్లాడిపోతూ ఉంటారు . ఒక రిస్కీ షాట్ లో నటించిన ఒక ఎమోషనల్ సీన్ లో చంప దెబ్బ కొట్టాల్సిన సిచువేషన్ వచ్చిన తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు.  ప్రజెంట్ రాంచరణ్ ఫ్యాన్స్ అదే విధంగా ఫీల్ అయ్యే సిచువేషన్ ఏర్పడింది.  మనకు తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "పెద్ది" సినిమాలో నటిస్తున్నాడు. 


"ఉప్పెన" లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీ అందుకున్న బుచ్చిబాబు సనా.. ఎంతో టైం గ్యాప్ తీసుకొని మరి దానికి తెరకెక్కిస్తున్న సినిమానే ఈ "పెద్ది". ఈ సినిమాలోని ఒక్కొక్క సీన్ హైలెట్ గా ఉండబోతుంది అంటూ మేకర్స్ చెప్తున్నారు . తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఎమోషనల్ క్లైమాక్స్ సీన్ ని షూట్ చేశారట . ఈ క్లైమాక్స్ సన్నివేశంలో రామ్ చరణ్ ని లాగి పెట్టే షాట్ కూడా చిత్రీకరించారట . ఎంత ట్రై చేసినా ఆ నేచురల్ ఎక్స్ప్రేషన్స్ రాకపోవడంతో రాంచరణ్ ని నిజంగానే ఆ యాక్టర్ దగ్గర కొట్టించాడట ఆ స్టార్ట్ డైరెక్టర్ .



రామ్ చరణ్ చెంప పగిలిపోయేలా ఆ సీన్ తెరకెక్కించారట . ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా పెద్ద స్టార్స్ ఇలా రియల్ గా కొట్టించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపరు. కానీ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఏదైనా నేచురల్ గా ఉండాలి అనుకుంటాడు . సినిమా కోసం ఏదైనా చేస్తాడు . ఆ కారణంగానే ఈ విధంగా చేశాడు అంటున్నారు మెగా ఫ్యాన్స్ . సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు అభిమానులు. ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అందుకుంటుంది అని చెప్పడంలో సందేహమే లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: