హనూ రాఘవపూడి,ప్రభాస్ కాంబోలో వస్తున్న ఫాజీ మూవీలో కొత్త హీరోయిన్ గా ఇమాన్వీ ఇస్మాయిల్ ని తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాల సమయంలో సడన్ గా ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ తో మెరిసేసరికి అందరూ ఈ కొత్త హీరోయిన్ ఎవరని తెగ సెర్చ్ చేశారు. అయితే ఇమాన్వీ ఇస్మాయిల్ ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కేవలం ఇంస్టాగ్రామ్ లో ఉన్న రీల్స్ చూసే హనూ రాఘవపూడి తన మూవీకి హీరోయిన్ గా సెట్ అవుతుందని తీసుకున్నారట. అయితే కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అయిందంటే చాలామందిలో ఆ హీరోయిన్ ఎవరు అని తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ వంటి పాన్ ఇండియా రేంజ్ హీరో సరసన నటిస్తుందంటే ఆ హీరోయిన్ బ్యాగ్రౌండ్ బయటపడకుండా ఉండదు. అలా అప్పట్లో ఈ హీరోయిన్ పాకిస్తాన్ అని కొన్ని వార్తలు వినిపించాయి.

 అయితే తాజాగా పహల్ గామ్ లో జరిగిన ఉగ్రదాడి కారణంగా పాకిస్తానీలను భారతీయులు ఎంతగానో వ్యతిరేకిస్తూ ఛీ కొడుతున్నారు. అంతేకాదు పాకిస్తానీలు  భారత్ నుండి వెళ్లిపోవాలని ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆదేశించింది. ఇప్పటికే ఎంతో మంది పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వదిలి పాకిస్తాన్ కి వెళ్ళిపోతున్నారు. ఇందులో భాగంగా ఫాజీ మూవీలో నటించే హీరోయిన్ కూడా పాకిస్తాన్ కాబట్టి వెంటనే ఆ హీరోయిన్ ని అందులో నుండి తీసేసి పాకిస్తాన్ కి వెళ్ళగొట్టాలి అని ఆ సినిమాలో హీరోయిన్గా ఇమాన్వీని తీసుకుంటే సినిమానే బ్యాన్ చేస్తామంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ పోస్టులపై స్పందించిన ఇమాన్వి నేను పాకిస్తాన్ ని కాదు అని,నా రక్తంలో భారతీయత ఉంది అని..నేను లాస్ ఏంజల్స్ లో పుట్టాను.మా ఫ్యామిలీ అమెరికాకి చెందిన పౌరులే అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే దాంతో గొడవ సర్దుమనింగిందని అందరూ అనుకున్నారు. కానీ సడన్గా గతంలో ఇమాన్వీ ఇస్మాయిల్ పెట్టిన పోస్టులను దొరకబట్టారు నెటిజన్స్. అయితే అందులో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇమాన్వీ ఇస్మాయిల్ నా తండ్రి పాకిస్తాన్ నా తల్లి ఇండియా అని వచ్చేలా పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ చేస్తూ ఇమాన్వి చెప్పింది పూర్తిగా అబద్ధమని, ఆమె తండ్రి పాకిస్తానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆమె కూడా పాకిస్తానీనే అని ఆధారాలతో సహా దొరికిపోయింది అంటూ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: