
ఇక.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో చివరిగా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న అనిల్.. మెగాస్టార్‌తో సినిమాను నెక్స్ట్ లెవెల్‌లో రూపొందించనున్నట్లు తెలుస్తుంది. ఇక వింటేజ్ చిరును చూపిస్తూ.. ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తానని అనిల్ ప్రామిస్ చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్‌లో కనిపించనున్నాడట. . ఇలాంటి క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఓ క్రేజి అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఈ సినిమాలో ... చిరంజీవి సరసన అందాల ముద్దుగుమ్మ నయనతార హీరోయిన్గా మెరవనుందని టాక్ ..
ఇక.. గతంలో గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు.. ఆయన సరసన హీరోయిన్గా నటించనుందా.. మరేదైనా పాత్రలో కనిపించనుందా అనే ఆసక్తి అభిమానులలో మొదలైంది. కాగా మరోపక్క నయనతార రెమ్యునరేషన్‌కు టీం షాక్ అయ్యారని.. ఆమె డిమాండ్ చేసిన రేంజ్‌లో పారితోషకం ఇచ్చేందుకు సుముఖత చూపించడం లేదంటూ టాక్ కూడా వైరల్ గా మారుతుంది. ఫైనల్గా సినిమా విషయంలో మేకర్స్ ఎలాంటి డేసిషన్ తీసుకుంటారో.. నయనతార సినిమాల్లో నటిస్తుందో ... లేదో.. వేచి చూడాలి ..